నా మౌనంనా మౌనంలో తీయని బాధుంది
నిను బాధించనన్న భావనుంది
నువు సుఖంగా ఉంటావన్న ఆశవుంది
అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం
నా మౌనంలో తెలియని కోతవుంది
నీ నవ్వు చెదరదన్న ఆకాంక్షుంది
నీ బ్రతుకున పువ్వులునిండాలన్న కోరికుంది
అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం
నా మౌనంలో తీరని ఆశుంది
నీ బాటన ముళ్ళుండవనిపించింది
నీ వయసంతా వసంతమనిపించిది
అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం
నా బ్రతుకును నే మార్చుకున్నా
నా ఆశలు నే మింగుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
అంతా నా స్వార్ధం అందుకే నా ఈ మౌనం